Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బస్సు ప్రమాదంలో కర్ణాటక మెగా అభిమానుల సంఘం ప్రెసిడెంట్ దుర్మరణం

ఈ తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాదు వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. కాగా, మరణించిన వారిలో అఖిల కర్ణాటక చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు కొట్టె వెంకటేశ్ యాదవ్ కూడా ఉన్నారు. వెంకటేశ్, ఆయన సోదరి బస్సు ప్రమాదంలో దుర్మరణం పాలవడం పట్ల మెగా ఫ్యామిలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు మెగా ఫ్యామిలీ పీఆర్వో ఎస్ కేఎన్ ట్విట్టర్లో వెల్లడించారు. వెంకటేశ్ కుటుంబానికి మెగా ఫ్యామిలీ సంతాపం తెలిపినట్టు వివరించారు.

More Telugu News